KRNL: శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దేవి ఆలయాన్ని పూలతో విద్యుత్ బల్బులతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. జ్యోతుల ప్రదర్శనలో పాల్గొనడానికి ధర్మవరం నుంచి 100 మంది భక్తులు ప్రత్యేకంగా వచ్చారు. వారు అమ్మవారి జ్యోతులను తలపై ఉంచుకొని స్తుతిస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.