CTR: SR పురం మండలంలోని సింధూరాజపురానికి చెందిన నిరంజన్ కుమార్ (40) బెంగళూరులో గ్యారేజ్‌లో పనిచేస్తున్నాడు. ఈ మేరకు బైక్ ప్రమాదంలో తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరి బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. దీంతో అవయవ దానంపై అవగాహనతో కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. మరణానంతరం కూడా జీవదానం చేసిన అతని త్యాగం ప్రశంసనీయం.