నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి రామ్నాథ్ అధికారి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. కాగా, నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.