AP: విశాఖ నగర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి డీఎస్‌బీవీ స్వామి అన్నారు. జీవీఎంసీ జోన్-2లో భూగర్భ డ్రైనేజీకి ఐఎఫ్‌సీతో ఒప్పందం శుభపరిణామం అని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఐఎఫ్‌సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచిందని చెప్పారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.