KMM: కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తన అక్షరాలతో ప్రజల ఆవేదనను, ఆకాంక్షలను ప్రతిబింబించారని కొనియాడారు. తెలంగాణ భాషకు, యాసకు ఆయన ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.