MLG: తాడ్వాయి (M) మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెల మార్పుపై పూజారుల సంఘం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. గద్దెల మార్పు విషయంలో ప్రభుత్వం, మంత్రులు సీతక్క, సురేఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టకుండా, పూజారుల అనుమతితోనే గద్దెల మార్పు జరుగుతుందన్నారు. ఆదివాసీ, ఆదివాసీయేతర సంఘాలు సంయమనం పాటించి సహకరించాలని కోరారు.