»Kakani Goverdhan Reddy Says Chandrababu Is Iron Leg
Kakani: తారకరత్న మృతి వరకు… చంద్రబాబు అడుగు పెడితే అక్కడ అంతే
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పాదం ఐరన్ లెగ్ గా చరిత్రకు ఎక్కిందన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని బలవంతంగా లాక్కున్న చంద్రబాబు కనీసం పార్టీని కూడా నడుపుకోవడం చేతకాదన్నారు. మోసం చేసి బతకడమే పనిగా పెట్టుకున్నారన్నారు. నీతి, నిజాయితీ అనేది చంద్రబాబులో ముచ్చుకైనా లేదన్నారు. తన కొడుకు నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించేందుకు ఎంతో అవస్థలు పడుతున్నారన్నారు.
చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిన అపశకునాలే ఆయనకు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. నెల్లూరుకు వచ్చి ఆరుగురిని చంపేశాడని, విజయవాడలో చీరలు పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మృత్యువాత పడడానికి కారణం అయ్యాడని, ఒంగోలు జిల్లాలో మరికొందరు మృతి చెందారని… ఇలా చంద్రబాబు ఎక్కడ పాదం పెట్టిన అక్కడ బస్మాసురుడి లాగా మారాడన్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న అస్వస్థతకు గురై మృతి చెందాడన్నారు.
ప్రజలతో పాటు దేవుడు కూడా చంద్రబాబు పరిపాలన వద్దని కోరుకుంటున్నారని వీటి ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ జనరంజక పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గృహ సారధుల ద్వారా ప్రతి ఇంటికి చేరేలా ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా గృహ సారధులకు సూచనలు చేస్తున్నట్లు చెప్పారు.