»American Heart Association Said Top 5 Healthy Foods For Heart Health
Heart Health Foods: గుండె ఆరోగ్యానికి.. టాప్ 5 హెల్తీ ఫుడ్స్
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆరోగ్యంలో గుండె చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీ హృదయనాళ వ్యవస్థలో ప్రధాన అవయవమైన హార్ట్(heart) శరీరం అంతటా రక్తాన్ని తరలిస్తుంది. మీ పల్స్ రేటు(pulse rate)ను నియంత్రించడానికి, రక్తపోటును నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. అయితే గుండె(heart) చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి, మనం దానిని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు? మీ ఆహారంలో ఏవి తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు చుద్దాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కొన్ని రకాల ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని సిఫారసు చేసింది.
1. పలు రకాల పండ్లు
ప్రతి సీజన్ లలో దొరికే పండ్ల(fruits)ను తప్పనిసరిగా తినాలని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు రంగురంగుల ఫలాలను కూడా స్వీకరించాలని అంటున్నారు. ఆపిల్, అరటి పండ్లు, నిమ్మ, బత్తాయి, కర్బూజ, పుచ్చకాయ సహా అనేక రకాల పండ్లు తినడం వల్ల మంచి పోషకాలతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు అంటున్నారు.
2. కురగాయలు
కూరగాయల్లో(vegetables) పోషక సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చిలగడ దుంపలు గుండె ఆరోగ్యానికి కీలకమైన ఖనిజమైన పొటాషియంను అందిస్తాయి. కూరగాయలు ధమనుల్లో అడ్డుపడే వాటిని నిరోధిస్తాయని పలువురు వైద్యులు అంటున్నారు. దీంతోపాటు ఆకుకూరల్లో ఫైబర్ స్థాయి ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
3. తృణ ధాన్యాలు
తృణధాన్యాల(Whole grains)ఉత్పత్తులు కూడా గుండెకు మేలు చేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సెలీనియం, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలు కూడా లభిస్తాయని తెలిపారు. దీంతోపాటు బీన్స్, బంగాళదుంపలు, బఠానీలు, మొక్కజొన్నల్లో సంక్లిష్ట పిండి పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు.
కొన్ని ప్రోటీన్లు(proteins) ప్రాసెస్ చేసిన మాంసం నుంచి లభిస్తాయి. వీటితోపాటు మరికొన్ని మొక్కల నుంచి లభ్యమైన ప్రోటీన్లు కూడా గుండెకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో పప్పులు, బీన్స్, గింజలు, టోఫు, తక్కువ కొవ్వు కల్గిన పాల ఉత్పత్తులు వినియోగించవచ్చని వెల్లడించారు.
5. హెల్తీ కొవ్వు పదార్థాలు
కొవ్వు గుండెకు ఇబ్బందిని కలిగిస్తుందని మీరు అనుకోవచ్చు. అయితే మీ గుండెతో సహా మీ శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు(healthy fats) అవసరం. కానీ అనేక అధ్యయనాలలో ట్రాన్స్, సంతృప్త కొవ్వులు హృదయ సంబంధ సమస్యలతో ముడిపడి ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో చేపలు, అవకాడో, ఆలీవ్, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్ నూనె వంటివి పరిమితంగా ఉపయోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్(American Heart Association) గుండె(heart) ఆరోగ్యం(health) కోసం ఈ ఆహారాలను వినియోగించాలని తెలిపింది. దీంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం వంటివి పాటించాలని వైద్యులు సూచించారు.