»Unidentified Caller Threatens To Blow Up Amitabh Dharmendra Ambanis Bungalows
Bomb Scare: అమితాబ్, ధర్మేంద్ర నివాసాలకు బాంబు బెదిరింపు
బాలీవుడ్ (Bollywood) అగ్రనటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra)లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళ వారం నటుల నివాసానికి ఈ బెదిరింపులు (threat calls) వచ్చాయి. వారి నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
బాలీవుడ్ (Bollywood) అగ్రనటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra)లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళ వారం నటుల నివాసానికి ఈ బెదిరింపులు (threat calls) వచ్చాయి. వారి నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుండి వచ్చాయో.. గుర్తించే పనిలో పడ్డారు. మరో షాకింగ్ విషయం ఏమంటే తీవ్ర వాద దాడి కోసం మారణాయుధాలతో 25 మంది ముంబైలోని దాదార్ కు చేరుకున్నారని కూడా అగంతకులు బెదిరించారు. జుహు, విల్లే పార్లే, గామ్ దేవిలలో, అలాగే నటుల నివాసాలలోను అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముంబైలో అమితాబ్ బచ్చన్ కు ఐదు లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అతని ఇళ్ల పేరు జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. ముంబైలో అమితాబ్ కొన్న మొట్టమొదటి ప్రాపర్టీ ప్రతీక్ష. అమితాబ్ తల్లిదండ్రులు ఇందులోనే నివసించారు. ప్రస్తుతం వీరు జల్సాలో జీవిస్తున్నారు. ఇక ధర్మేంద్ర జుహులో ఉంటున్నారు.
మరోవైపు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నివాసానికి కూడా పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపు కాల్ జాబితాలో అంబానీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ ఫ్యామిలీకి ముంబై, దేశంతో పాటు దేశ విదేశాల్లోనూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీముఖేష్ భరిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ భారత్ లో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని, విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.