»Trimmed Beard Short Hair Sharp Suit Rahul Gandhi Has A New Look For Cambridge Talk
Rahul Gandhi : న్యూ లుక్ లో రాహుల్ గాంధీ…. నెటిజన్లు ఫిదా..!
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుక్ మార్చారు. మొన్నటి వరకు ఆయన జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఆయన విపరీతంగా గడ్డం పెంచేశారు. కాగా... ఇప్పుడు ఆ గడ్డం తీసేసి స్మార్ట్ లుక్ లో కనిపించడం విశేషం.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుక్ మార్చారు. మొన్నటి వరకు ఆయన జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఆయన విపరీతంగా గడ్డం పెంచేశారు. కాగా… ఇప్పుడు ఆ గడ్డం తీసేసి స్మార్ట్ లుక్ లో కనిపించడం విశేషం.
లండన్ నగరంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నయా గెటప్ తో కనిపించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత్ జోడో యాత్ర మొదలైన దగ్గర నుంచి రాహుల్ గాంధీ గడ్డం తీయలేదు. జోడో యాత్రం ప్రారంభంలో చిన్నపాటి గెడ్డం, తెల్లని టీ-షర్టుతో కనిపించిన రాహుల్.. యాత్ర ముగిసేనాటికి పొడవాటి గెడ్డంతో మొత్తంగా అవతారమే మార్చేశారు. రాహుల్ అవతారంపై కాంగ్రెస్ మద్దతుదారులు ‘రుషి’ అంటూ పొగడ్తలు కురిపించారు. చాలా రోజులుగా ఇలాగే కనిపించిన ఆయన.. ఉన్నట్టుండి గెడప్ మార్చేశారు. ట్రిమ్మింగ్ చేసిన గెడ్డం, చిన్నపాటి హేర్ కట్.. ఇక వీటిని మించి సూట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాహుల్ గడ్డం తీసేసి.. సూట్ వేసుకుంటే చాలా స్మార్ట్ గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.