»Fire Accident In Jeedimetla Arora Pharmaceuticals Company Two Employees Died
Fire accident: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం..ఇద్దరు మృతి
హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) ప్రాంతంలోని ఆరోరా ఫార్మా ప్రైవేటు కంపెనీ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) పరిధిలోని ఆరోరా ఫార్మా సంస్థ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం ఫైర్ యాక్సిడెంట్(Fire accident) జరిగింది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో కెమికల్ ల్యాబులో రియాక్టర్ పేలడంతో ఆకస్మాత్తుగా మంటలు(fire) చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువకులకు మంటలు వ్యాపించాయి. అయితే వారి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో మంటల్లోనే మృత్యువాత చెందారు.
మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం ఎందుకు జరిగింది? మానవ తప్పిదం కారణంగా రియాక్టర్ పేలిందా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో అధికారులు(officers) వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇంకోవైపు హైదరాబాద్లో(hyderabad) ఎండాకాలం(summer) వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల కూకట్ పల్లి పరిధిలో రెండు ట్రావెల్ బస్సులు అగ్ని ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే తాజాగా ఇప్పుడు తాజాగా జీడిమెట్ల ప్రాంతంలో చోటుచేసుకుంది.