Renuka Chowdary : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
జగన్ అప్పుడు కూడా పిచ్చి వేషాలు వేసేవారు కానీ తండ్రిగా రాజశేఖర్ రెడ్డి బయటకు రాకుండా కాపాడినట్లు తెలిపారు. బంగారం లాంటి రాష్ట్రం పతనం అయిపోతుంది అని పేర్కొన్న ఆమె సుప్రీంకోర్టు తీర్పులను కూడా సీఎం లెక్కచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి తారకరామారావు కూడా రాజశేఖర్ రెడ్డిని గౌరవించేవారని… వారిరువురికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని, వారికి ఆత్మశాంతి లేకుండా ఈ పేర్లు ఇప్పుడు జగన్ మార్చారని అన్నారు.
అమరావతి రైతులను ఎంత అడ్డంపడితే అంతగా వారి ఉద్యమం బల పడుతుందన్న ఆమె ఈ ఉద్యమం ద్వారా రైతు గౌరవాన్ని పెంచారని అసలు రైతులకు కులం లేదని అన్నారు. ఇక గుడివాడ ప్రజలు కోరుకుంటే గుడివాడ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని పేర్కొన్న ఆమె ఇక్కడ పోటీ చేయాలంటే ఎవరి వీసా అవసరం లేదన్నారు. ఇక బిఆర్ఎస్, వైసీపీ కవల పిల్లలు లాగా తిరిగారని ఆమె ఎద్దేవా చేశారు. బిజేపి, బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాటి కంటే కాంగ్రెస్ లో విభేదాలు తక్కువేనని ఆమె కామెంట్ చేశారు.