»Bandi Sanjay Said We Will Demolish Their Houses With Bulldozers Telangana Women Victims
Bandi Sanjay: అఘాయిత్యాలకు పాల్పడితే బుల్ డోజర్లతో వారి ఇళ్లను కూల్చేస్తాం
గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఘటన నుంచి ఇటీవల చోటుచేసుకున్న ప్రీతి ఘటన వరకు ఏ ఒక్క దాని విషయంలో కూడా కేసీఆర్ సమీక్ష చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై.. యూపీలో మాదిరిగా బుల్ డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ(telangana)లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్(jubilee hills) ఘటన నుంచి నిన్న చోటుచేసుకున్న ప్రీతి ఘటన వరకు ఏ ఒక్క దానిపై కూడా కేసీఆర్ సమీక్ష చేయలేదని విమర్శించారు. ఈ కేసుల్లో అసలు నిందితులను వదిలేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇవాళ ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh) రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారం చేస్తే వారి ఇళ్లను కూల్చివేస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడే కూడా మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారికి అదే గతి పడుతుందని వెల్లడించారు. బీజేపీ మహిళా మోర్చా సమావేశం(BJP Mahila Morcha meeting)లో భాగంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణలో హోం మంత్రి ఎందుకు ఉన్నడో అర్థం కావడం లేదన్నారు.
కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు సంజయ్(Bandi Sanjay) గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అనేక మందికి ప్రధానిమంత్రి మోదీ(pm modi) అవకాశం కల్పించారని తెలిపారు. మరోవైపు రక్షణ రంగంతోపాటు అన్ని రంగాల్లో మహిళల(womens)కు ప్రధాని మోదీ ప్రాముఖ్యత ఇచ్చినట్లు చెప్పారు. ఇంకోవైపు తెలంగాణలో కూడా బీజేపీ మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మహిళల(womens) ఘటనలు చోటుచేసుకున్న సందర్భంలో ముందుగా స్పందించిన పార్టీ బీజేపీ(bjp) మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.
అసలు రాష్ట్రంలో కేసీఆర్(kcr) మహిళల గురించి పట్టించుకున్నా పాపనా పోలేదని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్(kcr) ఉత్త మాటలు చెప్పడం తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు. ఇంకోవైపు కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ దందా కోసం వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కానీ అనేక ప్రాంతాల్లో ఇంకా డబుల్ బెడ్ రూం ఇళ్లు(double bed room houses) లేవు, ఉద్యోగార్థులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు టైంకు జీతాలు లేవు, రుణ మాఫీ లేదు, రైతులకు 24 గంటల కరెంట్ లేదు ఇలా అనేక హామీలు పెండింగ్ లోనే ఉన్నట్లు సంజయ్ గుర్తు చేశారు. కేవలం లిక్కర్(liquor) ద్వారా మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేశారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలంగాణ(telangana)లో ప్రతి ఒక్క కుటుంబానికి 6 లక్షల రూపాయల అప్పు ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.