»Komatireddy Venkat Reddy Fasting Protest At Narsingi Sri Chaitanya College Against Satwik Suicide
Satvik Case:లో నిందితులను అరెస్ట్ చేయాలని కోమటి రెడ్డి నిరహార దీక్ష
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి నిరహార దీక్ష చేస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi) శ్రీచైతన్య జూనియర్ కాలేజ్( sri chaitanya junior college) దగ్గరకు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy venkat reddy) వెళ్లి నిరహార దీక్ష చేస్తున్నారు. సాత్విక్(satwik) ఆత్మహత్యకు కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధిత అబ్బాయి వాళ్ల పేర్లు చెప్పిన తర్వాత కూడా వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని నిలదీశారు. ఆ క్రమంలో కళాశాలకు వెళ్లిన కోమటిరెడ్డి.. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మేనేజ్ మెంట్ కు రక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు.
దీంతోపాటు తెలంగాణ(telangana) డీజీపీ(DGP)కి కూడా ఫోన్(phone) చేసి బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వారిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చొబెట్టిన తర్వాతనే తాను కాలేజ్ దగ్గర నుంచి పోతానని కోమటి రెడ్డి అన్నారు. అప్పటివరకు తాను మంచినీళ్లు కూడా స్వీకరించనని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy venkat reddy) స్పష్టం చేశారు. రాత్రి అయినా రేపు అయినా కూడా ఇక్కడే ఉంటానని అన్నారు.
ఈ క్రమంలో నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు(police) పెద్ద ఎత్తున మోహరించారు. తెలంగాణలోనే ఈ ప్రైవేటు కాలేజీల(private colleges) ఆరాచకం ఎక్కవగా ఉందని ఎంపీ(MP) అన్నారు. పలు రకాల కోచింగ్ ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కోమటి రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం ఏపీలో ఇలాంటివి తగ్గాయని అన్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో లభించిన లెటర్(letter) ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో కాలేజ్ ప్రిన్సిపల్, ఇంఛార్జీ, లెక్చరర్ పెట్టిన టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ పేర్కొన్నాడు. ఆ క్రమంలో కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక పోయాయని రాసుకొచ్చాడు. ఆ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని సాత్విక్ లెటర్లో వెల్లడించాడు. అంతేకాదు తన హాస్టల్లో(hostel) వీరు ముగ్గురు విద్యార్థులకు టార్చర్ చూపించారని వెల్లడించాడు. ఈ క్రమంలో వారిపై తప్పకుండా యాక్షన్(action) తీసుకోవాలని తన అమ్మను లేఖ(letter)లో కోరాడు. నేను మీ అందరిని చాలా బాధ పెడుతున్నందుకు సారీ. లవ్ యూ అమ్మా, నాన్న, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ లేఖలో తెలిపాడు.