Thakre - Komati Reddy : తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు... పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు… పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆయన పొత్తులపై చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి. ఈ క్రమంలో…. పరిస్థితిని చక్కపెట్టేందుకు కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే వచ్చారు. ఆయన… కోమటిరెడ్డిని స్వయంగా కలిసి మాట్లాడారు. వివాదం మరింత ముదురకుండా ఉండేందుకు మాణిక్ రావు.. ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానే భేటీ అయినట్లు తెలుస్తోంది.
కాగా.. పొత్తులపై మంగళవారం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. తొలుత రాష్ట్రంలో హంగ్ వస్తుందన్న ఆయన తర్వాత తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడ్డారు. ఇవి పార్టీకి నష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం మరింత ముదురుతుండడంతో కొత్త ఇంచార్జ్ కు ఈ ఎపిసోడ్ సవాల్ గా మారింది. కోమటిరెడ్డిని కట్టడి చేస్తారా? కఠినంగా వ్యవహరిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై థాక్రే ఏవిధంగా స్పందించనున్నారో చూడాలి.