టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో వ్యక్తి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ప్రదీప్ మాచిరాజు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని, ఆ వార్తలను కొంతకాలం గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
టాలీవుడ్లో పెళ్లికాని ఎలిజిబుల్ బ్యాచిలర్లలో మాజీ RJ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ఈ సర్క్యూట్లో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న యాంకర్, నటుడు తన పెళ్లి గురించి అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పెళ్లి వార్తలు వచ్చినప్పటికీ, అతను చాలాసార్లు వాటన్నింటినీ కొట్టిపారేశాడు. అయితే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడనే విషయం ఇటివల వెలుగులోకి వచ్చింది.
ప్రదీప్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న డీ ఫినాలే షోకు యాంకర్ గా వ్యవహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన కార్యక్రమానికి గెస్టులుగా హాయ్ నాన్న మూవీ టీం వచ్చింది. అందులో భాగంగా నాని, మృణాల్ ఠాకూర్ వచ్చారు. ఆ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ నానిని మీరు మీ భార్యను బుజ్జగించడానికి ఏం చేస్తారని ప్రశ్నించాడు. దీంతో న్యాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో స్పందించారు. వచ్చే ఏడాది 2024లో నీ పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలిసిందని నాని అంటాడు. ఆ క్రమంలో ప్రదీప్ అవన్నీ రూమర్లు సార్ ఎప్పటి నుంచో వస్తున్నాయని చెబుతాడు. అందుకు నాని మాత్రం ఇది రూమర్ కాదు. ఈసారి నీ పెళ్లి తప్పకుండా జరుగుతుందని మంచి సోర్స్ నుంచి సమాచారం వచ్చిందని చెబుతాడు. దీంతో ప్రదీప్ నానికి దండం పెట్టి ఎవరు చెప్పినా పర్లేదు సార్. కానీ మీరు చేప్తే ప్రజలు నిజంగానే నమ్ముతారని అనేస్తాడు. వీరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మరోవైపు ప్రదీప్ టాలీవుడ్‌కి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్, స్టైలిస్ట్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాడని ఒక పుకారు చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ తన టీవీ షోల కోసం అందించే దుస్తులను కూడా ఆమెనే డిజైన్ చేస్తుందని అంటున్నారు. అంతేకాదు ఆమె చాలా మంది బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ దుస్తులను డిజైన్ చేయడంలో కూడా పాపులర్ అని టాక్ వినిపిస్తోంది. ఈ కులాంతర వివాహానికి ప్రదీప్ కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.