»600 Crores For Animal What Is The Profit Of Telugu
Animalకు రూ.600 కోట్లు..తెలుగు లాభం ఎంతంటే?
మిక్స్డ్ టాక్‌తో మొదలైన అనిమల్ బాక్సాఫీస్ వేట.. రూ.600 కోట్లకు చేరుకుంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. సెకండ్ వీక్‌లోకి దూసుకుపోతోంది. ఎనిమిది రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులోను భారీగా లాభాలను తెచ్చిపెట్టింది.
600 crores for Animal What is the profit of Telugu
అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపాడు సందీప్ రెడ్డి వంగ(sandeep reddy vanga). సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయినా కూడా ఏ మాత్రం స్లో అవ్వట్లేదు అనిమల్(animal). ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది అనిమల్. ఫస్ట్ వీకెండ్లో రూ.563 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా.. ఎనిమిది రోజుల్లో రూ.600 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. ఈ ఏడాది బాలీవుడ్ సినిమా అందించిన బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచింది అనిమల్. రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
అర్జున్ రెడ్డి(arjun reddy)తో సంచలనం క్రియేట్ చేసిన డైరెక్టర్ అవడంతో.. తెలుగు జనాలు హిందీ హీరోని కాకుండా.. సందీప్‌ను మైండ్‌లో పెట్టుకొని థియేటర్లకు వెళ్లిపోయారు. దీంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ చేశారు. కానీ రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది అనిమల్. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయి సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయిన అనిమల్.. డబుల్ ప్రాఫిట్స్‌తో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకి పైగా గ్రాస్.. రూ.25 కోట్లకి పైగా షేర్ వసూళ్లను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో దిల్ రాజుకి రూ.10 కోట్లకి పైగా లాభాలను తెచ్చిపెట్టింది అనిమల్. మొత్తంగా.. ఈ సినిమా లాంగ్ రన్లో దిల్ రాజు(dil raju)కి భారీ లాభాలను ఇవ్వడం గ్యారెంటీ. ఇక ఓవరాల్‌గా చూస్తే.. రూ.250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన అనిమల్.. ఫస్ట్ వీక్‌లోనే రూ.338 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ లెక్కన ఇప్పటి వరకు రూ.100 కోట్ల లాభాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మరి లాంగ్ రన్లో అనిమల్ ఎంత రాబడుతుందో చూడాలి.