»Sandeep Reddy Vanga Into The Field For New Talent
Sandeep Reddy Vanga: కొత్త టాలెంట్ కోసం రంగంలోకి సందీప్ రెడ్డి వంగ?
సందీప్ రెడ్డి వంగ పేరు చెబితే.. సినిమాలతో పాటు పలు కాంట్రవర్శీలు కూడా తెరపైకి వస్తాయి. తన సినిమాల్లో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో.. ఖచ్చితంగా అది చెప్పి తీరుతాడు. లేటెస్ట్గా సందీప్ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
Sandeep Reddy Vanga into the field for new talent?
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. చేసింది మూడు సినిమాలే అయినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్.. అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి అదరగొట్టేశాడు. ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. రణ్‌బీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అనిమల్. ఈ సినిమాతో సందీప్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. దీంతో సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఫస్ట్ టైం ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్.
దీంతో.. స్పిరిట్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ అందరిలోను ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. అయితే.. స్పిరిట్ వచ్చే లోపు చిన్న సినిమాలను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, తన సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు సందీప్. ఇక ఇప్పుడు.. లో బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలనుకుంటున్నాడట సందీప్ రెడ్డి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ ఆఫీస్‌ను లీజ్‌కు తీసుకున్నాడని వార్తలు రాగా.. ఇక్కడి నుంచే తన సినిమా పనులు చేయనున్నాడ. మరి సందీప్ నుంచి వచ్చే కొత్త కుర్రాళ్లు, ఆ కొత్త కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.