ys sharmila:రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు పోరాటం, ప్రతిపక్షాలకు షర్మిల లేఖ
sharmila on write letter:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కలిసి పోరాటం చేద్దామని అందులో పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని అందులో కోరారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
sharmila on write letter:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ( ys sharmila) రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించేందుకు కలిసి పోరాటం చేద్దామని అందులో పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లి (delhi) వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని అందులో కోరారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని.. అరెస్ట్ చేసి వేధిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy), తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం (kodandaram), తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ (kasani gnaneshwar), బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (rs praveen kumar), ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి (asaduddin owaisi), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (tammineni veerabadram) , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావు (kunamneni sambashiva rao) , ఎన్ శంకర్ గౌడ్ (shankar goud), మందక్రిష్ణ మాదిగకు (manda krisha madiga) లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని షర్మిల ( ys sharmila) తెలిపారు. నోరు విప్పితే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డిస్కస్ చేయాలని అనుకుంటున్నానని ప్రస్తావించారు. విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ( kcr) సర్కారు పాలన వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో, రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను కల్వకుంట్ల కుటుంబం దోచేస్తుందని షర్మిల ( ys sharmila) అన్నారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని గుర్తుచేశారు.
చదవండి:sharmila on ysr statue vandalize:ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా.. ఖంత్రివా..! షర్మిల ఫైర్
జనం వద్దకు వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డుకుంటున్నారని లేఖలో షర్మిల ( ys sharmila) వివరించారు. పాదయాత్రలు చేసే వారిపై దాడులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు (brs) చేసే తప్పుల్ని వేలెత్తి చూపేవారిని హత్య చేసేందుకు వెనుకాడని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. వయసులో పెద్దవారనే తేడా లేకుండా నోటికి వచ్చినట్టు తిడుతూ, మహిళలు అనే గౌరవం లేకుండా అవమానిస్తున్న వైఖరిని ఖండించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ (kcr) నియంత పాలనలో రాజ్యాంగం కల్పించిన భావస్వేచ్ఛ కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే సోదరభావం, ప్రజల మధ్య సామరస్యం, ఐక్యత, ఇవి ఏమీ లేకుండా చేస్తున్న విధానాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి:kodandaram:మార్చి 10న తెలంగాణ బచావో.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ
పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనను కారులో ఉండగా టోయింగ్ చేసిన దారుణం గత పాలకుల హయాంలో జరగలేదు. కేసీఆర్ (kcr) వేల కోట్ల అవినీతిపై గళం విప్పినా తీవ్రంగా స్పందిస్తూ, సంబంధం లేని సెక్షన్లతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని షర్మిల ( ys sharmila) తెలిపారు. అమరవీరుల త్యాగాల్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. అందుకు జెండాలను పక్కన పెట్టి, ఒక్కటై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను (president rule) విధించాల్సిన అవసరం ఉందన్నారు. మన పోరు కేక నియంత కేసీఆర్ పాలనకు (kcr rule) చరమగీతంలా మారాలని షర్మిల అన్నారు. సర్కారును బర్తరఫ్ చేయాల్సిన చారిత్రక అవసరాన్ని ఇప్పటికే తెలంగాణ గవర్నర్కు (governer) నివేదించానని గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితిని గుర్తించి, అందరం కలిసి రాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలన గురించి విన్నవించాలన్నారు.