Vidudala Rajini : ర్యాగింగ్ పై మంత్రి విడుదల రజిని షాకింగ్ కామెంట్స్..!
Vidudala Rajini : వరంగల్ లో మెడిసిన్ చేస్తున్న ప్రీతీ అనే విద్యార్థి.. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేదింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ క్రమంలో పలు రాష్టాలు ఈ ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పక్క రాష్టం ఏపీలోనూ ర్యాగింగ్ పై అప్రమత్తం అయ్యారు అధికారులు.
వరంగల్ లో మెడిసిన్ చేస్తున్న ప్రీతీ అనే విద్యార్థి.. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేదింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ క్రమంలో పలు రాష్టాలు ఈ ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పక్క రాష్టం ఏపీలోనూ ర్యాగింగ్ పై అప్రమత్తం అయ్యారు అధికారులు. ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశాలు ఇచ్చారు.
మెడిసిన్ , ఇంజనీరింగ్ , అనేది కాకుండా స్టూడెంట్ పై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదన్నారు విడదల రజిని. కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పvidudalaర్యవేక్షణ ఉండాలన్నారు.
ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారు ఇది మార్చుకోవాలని అన్నారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేలా వారికీ యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కళాశాలలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ర్యాగింగ్ కు ఏ స్టూడెంట్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.