»The School Boy Who Saved The Crow The Twitter Video Is Viral
Viral Video: కాకిని కాపాడిన స్కూల్ పిల్లాడు
ఓ స్కూల్ పరిధిలోని వలలో చిక్కుకున్న కాకిని చూసి ఓ పిల్లాడు కాపాడాడు. జాగ్రత్తగా వల నుంచి కాకిని బయటకు తీసి ఆకాశంలోకి ఎగురవేశాడు. ఆ క్రమంలో అతనితోపాటు ఉన్న చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
మంచి మనసు ఉండాలే కానీ ఎవరికైనా సాయం చేయవచ్చు. మనకెందుకులే అనుకుంటే..ఒకనొక సందర్భంలో మనల్ని కూడా ఆపద సమయాల్లో కాపాడేవారు ఉండరని పలువురు చెబుతుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఓ స్కూల్ పరిధిలోని వలలో చిక్కుకున్న కాకిని(crow) స్కూల్ యూనిఫాం ధరించిన ఓ పిల్లవాడు(chid) గమనించి కాపాడాడు. సురక్షితంగా వల నుంచి కాకి(crow)ని జాగ్రత్తగా బయటకు తీసి గాల్లోకి వదిలేశాడు. అదే క్రమంలో అతన్ని గమనించిన తోటి విద్యార్థులు(students) కూడా అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో చిన్నారుల ముఖాల్లో వచ్చిన సంతోషం వెలకట్టలేమని చెప్పవచ్చు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
ఈ దృశ్యాలను అక్కడ ఉన్న ఓ ఉపాధ్యాయుడు ఫోన్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియా(social media) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్(viral) అవుతోంది. రెండు రోజుల్లోనే 84 వేల మందికిపైగా షేర్ చేయగా, 2400 మందికిపైగా ఈ వీడియో(video)ను లైక్ చేశారు. అంతేకాదు మరికొంత మంది కాకిని కాపాడిన క్రమంలో పిల్లాడిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. గుడ్ జాబ్ అని ఒకరు, ఆ పిల్లాడిని ఆశీర్వదించాలని మరొకరు ఇలా పలురకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు.
మరోవైపు ఇటీవల సంక్రాంతి(sankranti) పండుగ సందర్భంగా పతుంగులు ఎగురవేసిన క్రమంలో వాటికి కట్టే మాంజా కారణంగా కూడా అనేక పక్షలు వాటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే పండుగ సంబరాలు చేసుకోవడం మంచిదే కానీ.. ఆ క్రమంలో ఇతర ప్రాణులను ఇబ్బందులకు గురిచేయకూడదని పలువురు కోరుతున్నారు. అంతేకాదు అలాంటి సమయంలో వలల్లో చిక్కుకున్న పక్షులకు ప్రత్యేకంగా కాపాడేందుకు పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు మనుషులను కూడా ఏర్పాటు చేసి పక్షులను రక్షిస్తున్నాయి.