»Cyber Crime In Hyderabad Company Losses Rs 7lakhs
Cyber Crime : ఒక్క మొయిల్ తో… రూ.7లక్షలు కాజేశారు..!
Cyber Crime : దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు, అధికారులు ప్రజలను నిత్యం ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నా కూడా... ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ కంపెనీ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కి దాదాపు రూ.7లక్షలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు పోలీసులు, అధికారులు ప్రజలను నిత్యం ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నా కూడా… ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ కంపెనీ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కి దాదాపు రూ.7లక్షలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాగ్ అంబర్ పేట్ లోని ఏబీఆర్ ఆర్గానిక్ సంస్థ చైనా దేశానికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండు కంపెనీలు కూడా ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా చైనా సంస్థ ఉపయోగించే ఈ మెయిల్ కు నకిలీ మెయిల్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు అకౌంట్ మారిందంటూ ఏబీఆర్ సంస్థకు మెయిల్ చేశారు.
ఈ క్రమంలో ఏబీఆర్ సంస్థ ప్రతినిధులు ఆ అకౌంట్లో ఏడున్నర లక్షలు జమ చేశారు. ఆ తరువాత మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.