GNTR: రాజధాని ప్రాంతంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో 190 MLD సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. కృష్ణాయపాలెం – వెంకటపాలెం మధ్య, పాలవాగు సమీపంలోని N4-E1 రోడ్ల జంక్షన్ వద్ద NCC సంస్థ ఈ ప్లాంట్ను నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని నివాసితులకు తాగునీరు అందనుంది.