W.G. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సచివాలయం వద్ద మీ భూమి – మీ హక్కు గ్రామ సభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తుగ నాగరాజు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో రీసర్వే పూర్తయిన రైతులకు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.