కేథార్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు న్యాయవాదులకు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపించారు. నకిలీ సైట్ ద్వారా హెలీకాఫ్టర్ టికెట్లను జారీ చేసి వారిని ఇబ్బందుల పాలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fake Helicopter Tickets : ఇటీవల ఇంటర్నెట్లో జరిగే మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అదును చూసుకుని చిక్కినవారినల్లా మోసం చేస్తున్నారు. డబ్బులను కొల్లగొట్టేస్తున్నారు. అయితే మనకు ఏదైనా న్యాయపరమైన సమస్య వస్తే లాయర్ దగ్గరకు వెళతాం. అలాంటి లాయర్లనే వారు మోసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పదకొండు మంది న్యాయవాదులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ప్రధాన ఆలయాన్ని చేరుకోవడానికి 22 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉంటుంది. ఆ అటవీ ప్రాంతాన్ని దాటుకుని వెళ్లడానికి కాలినడకనైనా వెళ్లాలి. లేదంటే హెలీకాఫ్టర్ ఎక్కి వెళ్లాలి. ఈ న్యాయవాదులంతా హెలీకాఫ్టర్లో( Helicopter) ఒక్కో టికెట్‌కు రూ.6000 వరకు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు కొన్నారు.
ఆ టికెట్లను పట్టుకుని మంగళవారం హెలీకాఫ్టర్ సర్వీసు ఇచ్చే చోటికి వెళ్లారు. వారు ఆ టికెట్లను పరిశీలించి అవి నకిలీవని(Fake) తేల్చారు. దీంతో లాయర్లంతా ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఆ నకిలీ వెబ్ సైట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఇలా వారు వందల మంది యాత్రికులను మోసం చేస్తున్నారని తెలిసింది. దీంతో లాయర్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.