AP: Dy.CM పవన్ సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.