»26 Years Teacher Love With 15 Years Student At Chanda Nagar Hyderabad
Teacher Love Student: 10వ తరగతి విద్యార్థితో టీచర్ లవ్ స్టోరీ..ఆమె తాత పోలీసులకు ఫిర్యాదు
10వ తరగతి విద్యార్థి(student)తో ఓ ఉపాధ్యాయురాలు(teacher) ప్రేమాయానం(love story) నడిపింది. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఓ రెండు రోజులు పారిపోయి..మళ్లీ తిరిగి వచ్చారు. కానీ ఈ విషయం తెలియక వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎక్కడో కాదు హైదరాబాద్(hyderabad) చందానగర్(chanda nagar) పరిధిలోని ఓ స్కూల్లో చోటుచేసుకుంది.
ప్రేమ(love)కు చిన్నా పెద్ద, తెలుపు నలుపు అంటూ ఏది ఉండదని పలువురు చెబుతుంటారు. అంతేకాదు లవ్ ఇజ్ బ్లైండ్ అని కూడా మరికొంత మంది అంటుంటారు. ప్రేమకు కులం, మతం ఏది ఉండదనే చెప్పవచ్చు. ఇక ఈ ప్రేమ మైకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు..ఏందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా అనేక రకాల పనులు చేస్తుంటారు. అసలు ఇవన్నీ ఎందుకంటే ఇటీవల ఓ పదో తరగతి విద్యార్థిని అదే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయురాలు(teacher) ప్రేమించి ఇద్దరు అదృశ్యమయ్యారు.
ఈ విషయం తర్వాత తెలుసుకున్న ఉపాధ్యాయురాలి(teacher) తాతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్(hyderabad)లోని చందానగర్(chanda nagar) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(police station) పరిధిలో జరిగింది. అయితే 26 ఏళ్ల టీచర్(teacher).. ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అదే క్రమంలో ఆ పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల విద్యార్థితో ప్రేమ(love)లో పడింది. అయితే గత నెలలో తన మనుమరాలు(grand daughter) కనిపించడం లేదని అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత రెండు రోజులకు వచ్చి మళ్లీ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు. తన మనుమరాలు తిరిగి వచ్చిందని చెప్పాడు.
అదే క్రమంలో తమ కుమారుడు కూడా కనిపిస్తలేడని ఓ విద్యార్థి(student) కుటుంబం(family) కూడా ఫిర్యాదు(complaint) చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు(police) వారిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పారు. ఉపాధ్యాయురాలితో కలిసి ఫిబ్రవరి 16న బయటకు వెల్లినట్లు విద్యార్థి వెల్లడించాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలిని కూడా పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది.