»Vijayawada Peoples Court Order To Arrest Warrant Mla Kodali Nani
Kodali Nani:ని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశం
ఏపీ(ap)లోని గుడివాడ(gudivada) ఎమ్మెల్యే(mla) కొడాలి నాని(Kodali Nani)కి గట్టి షాక్ తగిలింది. ఇతని అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేయాలని పోలీసులను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
ఏపీ(ap)లోని గుడివాడ(gudivada) ఎమ్మెల్యే కొడాలి నాని(MLA Kodali Nani)కి గట్టి షాక్ తగిలింది. ఇతని అరెస్ట్ కోసం వారెంట్(arrest warrant) జారీ చేయాలని పోలీసుల(police)ను కోర్టు ఆదేశించింది(order). అయితే నానిపై గత ఏడాది జనవరి 5వ తేదీ నుంచి అరెస్ట్ వారెంట్ పెండింగ్లో ఉండటంపై న్యాయస్థానం(court) అసంతృప్తి వ్యక్తం చేసింది. వాయిదాల కోసం కోర్టుకు కొడాలి నాని రావాలని చెప్పినా కూడా రావడం లేదని విజయవాడ(vijayawada) ప్రజాప్రతినిధుల కోర్టు(vijayawada people’s Court )అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరైన గవర్నర్ పేట సీఐ సురేష్ కుమార్ ను న్యాయస్థానం ఈ అంశంపై ప్రశ్నించింది. నానిపై పెండింగ్ లో ఉన్న అరెస్ట్ వారెంట్ ను అమలు చేయాలని జస్టిస్ గాయత్రీ దేవి సీఐకి తెలిపారు.
అయితే గతంలో ఏపీ(ap) రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ విజయవాడ(vijayawada) తుమ్మలపల్లి కళా క్షేత్రం నుంచి వన్ వేలో ర్యాలీ చేపట్టి ఆందోళనలు(protest) నిర్వహించారు. ఆ క్రమంలో పోలీసుల(police) ఉత్తర్వులు ఉల్లఘించి 2016 మే 10న ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani), మాజీ మంత్రి పార్థసారథి సహా పలువురు నాయకులు నిరసన చేపట్టారు. ఆ క్రమంలో వీరి ఆందోళన కారణంగా ట్రాఫిక్ సమస్య(traffic problem) ఏర్పడిందనే కారణంతో వీరిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో(governorpet police station) కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరు అవడం లేదని ఈ మేరకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనవరి 5 నుంచి ఇది పెండింగ్ లోనే ఉంది.