Arrest Warrant: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాకు అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ అయ్యింది. విజయవాడలో గల ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. ముగ్గురు నేతలు 2015లో విజయవాడ బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆందోళనకు సంబంధించి కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ముగ్గురు నేతలు విచారణకు హాజరు కావడం లేదు. దీంతో మేజిస్ట్రేట్ అరెస్ట్ వారంట్ జారీ చేశారు.
కొడాలి నాని (kodali nani) గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్థసారథి పెనమలూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గొడవ జరిగిన సమయంలో వంగవీటి రాధా (radha) వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. కొడాలి నాని, రాధా మంచి స్నేహితులు. వీరికి వల్లభనేని వంశీ (vamsi) కూడా మంచి స్నేహితుడు. గన్నవరం అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత వైసీపీ అనుబంధ శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొడాలి నాని, వంశీ వైసీపీలో ఉండగా.. రాధా మాత్రం టీడీపీలో ఉన్నారు. రాధా వివాహాం ఇటీవల నిశ్చయమైన సంగతి తెలిసిందే.