Megha బంధం.. ఇరు రాష్ట్రాల సీఎంలతో సఖ్యత, ఎలా అంటే.?
మేఘా కృష్ణారెడ్డికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో మంచి అనుబంధం ఉంది. మీడియాలో వాటాలు కొని, ఆ రెండు పార్టీలను ప్రమోట్ చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రభుత్వాల ద్వారా ప్రాజెక్టులు తీసుకుంటున్నారని సమాచారం.
Megha Krishna Reddy: మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy).. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పారిశ్రామిక వేత్త పేరు వినిపిస్తోంది. ఎందుకంటే మేఘా కంపెనీలో పని చేసే పీవీ రమేష్.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ గురించి చెప్పారని సీఐడీ అధికారులు వివరించారు. అబ్బే.. అదేం లేదని మీడియా ముందుకొచ్చారు రమేశ్. అలా చెప్పాడో లేదో.. ఆ మరునాడే మేఘా కంపెనీ వ్యవహారాల నుంచి బయటకు వచ్చారు. పైకి రాజీనామా అంటున్న.. లోన మాత్రం పంపించేశారనే రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి బట్టి మేఘా కృష్ణారెడ్డికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది.
మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) వ్యాపార వేత్త.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ సర్కార్‌తో సఖ్యంగా మెలగుతారు. పట్టిసీమ ప్రాజెక్టు కూడా మేఘా కంపెనీకి దక్కింది. ఆ సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పటి విపక్ష నేత జగన్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత మాత్రం ఆ ఊసే లేదు. సీఎంగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టును కూడా మేఘాకు కట్టబెట్టారు. తెలంగాణలో కూడా పలు ప్రాజెక్టులు మేఘాను దక్కాయి. ఇలా కేసీఆర్, జగన్‌తో కృష్ణారెడ్డి సఖ్యంగా ఉంటున్నారు.
2019 ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు మై హోం గ్రూమ్ టీవీ-9లో 200 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ సమయంలో బీఆర్ఎస్, వైసీపీ మౌత్ పీస్‌గా పనిచేసింది. ప్రస్తుత నంబర్ వన్ చానెల్ ఎన్టీవీలో మేఘా వాటా 22.8 శాతం ఉండగా.. మై హోం గ్రూప్ 11 శాతం షేర్ ఉంది. ఆ రెండు సంస్థలు మీడియాలో పెట్టుబడులు పెట్టి.. ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయిస్తున్నాయి. తర్వాత మెజార్టీ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నాయి. అందుకోసమే మీడియా ముందుకు వచ్చిన పీవీ రమేష్‌ను తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కంట్రోల్ చేశారు. ఆయన మేఘాలో పనిచేస్తున్నందున వెంటనే రాజీనామా చేసేలా ఒత్తిడి చేశారు.
సో.. పాలకులు తలచుకుంటే ఏ పనులైనా జరిగిపోతాయి. చంద్రబాబు అరెస్ట్ చూపేందుకు పీవీ రమేష్‌ను పావుగా వాడుకున్నారు. అదేం లేదు అని నోరు తెరవగా.. ఉన్న ఉద్యోగం తీసి వేయించారు. దీంతో ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.