Stock market: స్టాక్ మార్కెట్లు (Stock market) ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి. గత మూడు రోజుల నుంచి నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమై.. లాభాల్లో కొనసాగాయి. ఐటీ, ఫార్మా రంగాల సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 481 పాయింట్లు లాభపడి 65, 721కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకుని 19,517 వద్ద ఆగింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.25 శాతం, టెక్ మహీంద్రా 2..91 శాతం, విప్రో 2.28 శాతం, భారతీ ఎయిర్ టెల్ 2.02 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.72 శాతం లాభ పడ్డాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.94 శాతం, ఎన్టీపీసీ 1.09 శాతం, మారుతి 0.83 శాతం, టాటా మోటార్స్ 0.69 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.59 శాతం నష్టపోయాయి.