హైదరాబాద్(Hyderabad)లో ఓ అద్బుతం ఈ దృశ్యం కనిపించింది. జీరో షాడో పేరుతో ఎండలో నించుని, అందులోని వింతను ప్రజలు కళ్లారా చూశారు. సాధారణంగా సూర్యుడు (Sun) నడినెత్తిన ఉన్నసమయంలో ఎండలో నించుంటే మన నీడ నేలపై కనిపించకపోవడాన్ని గమనించొచ్చు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం అయింది.ఇలా నీడ పడకపోవడాన్ని జీరో షాడో(Zero Shadow)గా చెబుతారు. సూర్యుడు ఆకాశంలో మధ్య భాగంలోకి చేరినప్పుడు ఇది సాధ్యపడుతుంది.
ఈ విషయాన్ని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ (Bm Birla Science Centre) టెక్నికల్ అధికారి ఎన్.హరిబాబుశర్మ తెలిపారు.అదే సూర్య కాంతిలో ఏ వస్తువు ఉంచిన దాని నీడ పడదని తెలిపారు. ఈ అద్భుతం వెనక చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. భూమి రోజూ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీది నుంచి వెళ్తూ.. సూర్యకిరణాలు (Sun rays) 90 డిగ్రీల కోణంలో భూమ్మీద పడతాయి. ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ.. సరిగ్గా ఆ వస్తువు కిందే పడుతుంది. దీన్నే జీరో షాడో మూమెంట్ అని పిలుస్తారు.