»Wasim Zafar Suggested That Cricket Player Sanju Samson Is A Gifted Player And Needs To Learn More
Sanju Samson: సంజూ శాంసన్ సత్తా ఉన్న ప్లేయరే.. కానీ
భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో భారత మిడిలార్డర్లో రాణిస్తాడు అనుకుంటున్న తరుణంలో తన బ్యాటింగ్ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం, భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశారు.
Wasim Zafar suggested that cricket player Sanju Samson is a gifted player and needs to learn more.
Sanju Samson: భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వెస్టిండీస్‌తో మూడో వన్డేలో (WI vs IND) హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఆసియా కప్(Asia Cup,), వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత మిడిలార్డర్‌కు కీలకంగా మారతాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అతని బ్యాటింగ్ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం(Saba Karim) ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్(Wasim Zafar) కీలక సూచనలు చేశారు.
‘సంజూ శాంసన్ ఆటతీరు ఓ అంతుచిక్కని విషయం. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. భారత్‌కు గిఫ్టెడ్ ప్లేయర్. ఆయన ఇన్నింగ్స్ ఎప్పుడూ కొత్తగా ఉంటాయని తెలిపారు. తానెప్పుడూ దూకుడుగా ఆడేందుకు చూస్తానని చెప్పాడు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనే సమయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తాడు. సంజూ శాంసన్ సత్తా ఏంటో విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో చూశాం. కచ్చితంగా ఇండియన్ టీమ్‌లో స్థానం ఉండాల్సిన వ్యక్తి. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థుడు. కానీ రెగ్యులర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునేటప్పుడు మాత్రమే అతడికి అవకాశం వస్తోంది. అతడిని మూడో స్థానంలో పంపిస్తే మరింత మెరుగ్గా ఆడతాడు’ అని సబా కరీం (Saba Karim) కామెంట్ చేశారు.
సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అనడంలో అనుమానం లేదు. అతను ఎక్కువగా రిస్క్ తీసుకుంటాడు. దాని నుంచి బయటకొస్తే సిక్స్‌ల వర్షం కురిపించగలడు. ఇలా ఆడేందుకు టీమ్ అనుమతి ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్లేయర్ గ్రీజ్‌లో నిలకడగా ఆడాలి. విధ్వంసం చేయాలని భావిస్తే ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఓ రెండు లేదా మూడు ఇన్నింగ్స్‌ల్లో కష్టం అవుతుంది. గత ఐపీఎల్‌లోనూ చూశాం. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో రాణించి మరికొన్నింట్లో తేలిపోయాడు. కాబట్టి నిలకడగా ఆడుతూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వసీమ్ జాఫర్(Wasim Zafar) సూచించాడు.