»Two Thugs Who Broke Into Shahrukhs Bungalow Mannat Mumbai
Shah Rukh Khan:బంగ్లాలోకి చోరబడ్డ ఇద్దరు దుండగులు..కారణం ఇదేనంటా!
ముంబయి(mumbai)లోని బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. వారు గోడ దూకి భవనంలోకి ప్రవేశించగానే అక్కడి భద్రతా సిబ్బంది వారిని గమనించి పోలీసుల(police)కు అప్పగించారు. ఆ క్రమంలో వారు పఠాన్(pathan) మూవీ హీరో షారూఖ్ ను కలిసేందుకు వచ్చామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) బంగ్లా(bungalow)లోకి ఇద్దరు దుండగులు(two people) గురువారం చొరబడ్డారు. ముంబయి(mumbai) మన్నత్(mannat)లోని అతని నివాసంలోకి బయటి గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అది గమనించిన అక్కడి సెక్యురిటీ సిబ్బంది వారిని ఆపి పోలీసులకు అప్పగించారు. ఆ క్రమంలో వారు గుజరాత్(gujarat) నుంచి వచ్చామని ‘పఠాన్’(pathan) స్టార్‌ని కలవాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పారు. వారి వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని వెల్లడించారు. అయితే విచారణలో భాగంగా వారు నటుడిని కలిసేందుకే గుజరాత్ నుంచి వచ్చారని చెప్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వారిపై భారత శిక్షాస్మృతి (IPC) కింద పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయబడింది. మరోవైపు ఆ ఇద్దరు బంగ్లాలోకి ప్రవేశించినప్పుడు ఆ భవనంలో హీరో, అతని కుటుంబం ఉన్నారా లేదా అనేది కూడా తెలియదని వారు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన బంగ్లా వద్ద భద్రతపై ఆరా తీయాలని బాంద్రా పోలీసులు హీరో షారూఖ్ ఖాన్ కోరారు.
ఇక షారూఖ్ ఖాన్ ఇటీవల యాక్ట్ చేసిన పఠాన్ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా(world wide) రూ.1,000 కోట్ల కలెక్షన్ల మార్కును అధిగమించింది. ఈ చిత్రంలో షారూఖ్ సరసన దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటించారు. SRK ప్రస్తుతం తన తర్వాత చిత్రాలైన ‘జవాన్’, ‘డుంకీ’ కోసం సిద్ధమవుతున్నాడు. మరికొంత మంది అభిమానులు మాత్రం ‘పఠాన్’ తర్వాత ‘టైగర్ 3’ మూవీ రావాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం SRK-సల్మాన్ కలయికలో వస్తుంది.
చదవండి: Fire Accident ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. కాపాడిన రోబోలు
ఇంకోవైపు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) భార్య గౌరీ ఖాన్(Gauri Khan) పై ఇటీవల చీటింగ్ కేసు(cheating case) నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ప్లాట్ విషయంలో(Plot fraud) గౌరిఖాన్ తనను మోసం చేశారని ముంబయి(mumbai)కి చెందిన వ్యక్తి పోలీసు(police)లకు ఫిర్యాదు చేశాడు. అయితే గౌరీ ఖాన్ ఉత్తరప్రదేశ్ లక్నోలోని తులసియాని అపార్ట్మెంట్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ క్రమంలో లక్నోలో ఓ అపార్ట్మెంట్ కోసం తన నుంచి ఈ సంస్థ..86 లక్షల రూపాయలు తీసుకుందని పేర్కొన్నాడు. 2016లో తనకు ఇచ్చిన హామీ మేరకు ప్లాట్ అప్పగించలేదని జస్వంత్ షా(Jaswant Shah) ఆరోపించారు.
అయితే జస్వంత్ షా(Jaswant Shah) తనకు ప్లాట్ ఎందుకు ఇవ్వడం లేదని తెలుసుకోగా..అది మరొకరికి అమ్మినట్లు తేలింది. మరోవైపు ఆ ప్లాట్ కోసం ఇతను బ్యాంక్ నుంచి 85 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో తనకు ప్లాట్ దక్కకపోగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల తాను నష్టపోయానని(loss) వాపోయాడు. ఆ క్రమంలో అతను తులసియాని కన్స్ట్రక్షన్(Tulsiani Group) మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, డైరెక్టర్ మహేష్ తులసియాని, గౌరీ ఖాన్‌లపై లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒప్పంద ఉల్లంఘనకు గౌరీ ఖాన్ కూడా కారణమని ఆయన ఆరోపించారు.