IND Vs Aus: భారత క్రికెట్ జట్టు ఓటమి..షారూఖ్ ఖాన్ ట్వీట్ వైరల్
Ind Vs Aus ప్రపంచ కప్ 2023 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ODI ప్రపంచ కప్ ట్రోఫీని గెల్చుకుంది. ఈ నేపథ్యంలో అనేక మంది భారత అభిమానులు భారత ఆటాగళ్ల ఆటతీరుపై విమర్శళు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇండియా బ్యాంటిగ్ తీరును మెచ్చుకుంటున్నారు.
australia cricket team defeated to Indian team Shah Rukh Khan's tweet goes viral
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌ను ఓడించి 2023 ODI ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మొత్తం ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఓటమికి యావత్ దేశంలో చాలా మంది యువతతోపాటు అనేక మంది నిరాశను వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు నైతికంగా సపోర్ట్ చేస్తు మరికొంత మంది సెలబ్రిటీలు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
The way the Indian team has played this whole tournament is a matter of honour and they showed great spirit and tenacity. It’s a sport and there are always a bad day or two. Unfortunately it happened today….but thank u Team India for making us so proud of our sporting legacy in…
ఆ ట్వీట్లో భాగంగా ఈ మొత్తం టోర్నీలో భారత జట్టు ఆడిన తీరు చాలా బాగుందన్నారు. ఆ క్రమంలో వారు గొప్ప స్ఫూర్తిని పట్టుదలను ప్రదర్శించారని పేర్కొన్నారు. కానీ క్రీడల్లో ఎప్పుడూ మంచి రోజులు ఉండవు. మంచివి, చెడ్డ రోజులు రెండు ఉంటాయని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఇది చెడ్డరోజుగా జరిగిందన్నారు. అయినప్పటికీ క్రికెట్లో మా క్రీడా వారసత్వం గురించి మమ్మల్ని గర్వించేలా చేసినందుకు టీమ్ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు భారతదేశం మొత్తానికి చాలా ఉత్సాహాన్ని తెచ్చారు. మీకు దక్కిన ప్రేమ, గౌరవం మమ్మల్ని గర్వించే విధంగా చేసిందన్నారు.
ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు నరేంద్ర మోడీ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సమయంలో, కింగ్ ఖాన్ అంటే షారుక్ ఖాన్ కూడా తన కుటుంబంతో కలిసి టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు స్టేడియంలో కనిపించాడు. అయితే, భారత క్రికెట్ జట్టు 2023 ప్రపంచ కప్‌ను గెలుచుకోలేకపోయింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది.