ఐదేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్‌తో తన మొదటి చిత్రంతో రాజ్‌కుమార్ హిరానీ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరి కాంబోలో నేడు విడుదలైన తాజా చిత్రం డంకీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
చిత్రం: డంకీ
తారాగణం: షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, దియా మీర్జా, బోమన్ ఇరానీ మరియు ఇతరులు
దర్శకుడు: రాజ్‌కుమార్ హిరానీ
రచన: రాజ్‌కుమార్ హిరానీ, అభిజత్ జోషి & కనికా ధిల్లాన్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమారి హిరానీ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2023
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఈ ఏడాదిలో నటించిన మూడో చిత్రం డంకీ ఈరోజు(డిసెంబర్ 21న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అయితే డంకీ మూవీ ఎలా ఉంది? ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
కథ
మను (తాప్సీ పన్ను), బుగ్గు (విక్రమ్ కొచెర్), బల్లి (అనిల్ గ్రోవర్), సుఖి (విక్కీ కౌశల్) పంజాబ్‌లోని లాల్తు అనే గ్రామంలో నివసిస్తున్నారు. వీరంతా లండన్ వెళ్లి అక్కడ స్థిరపడి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అయితే, వీసా పొందడానికి వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. హార్డీ (షారూఖ్ ఖాన్) ఒక సైనిక అధికారి, మనుతో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలోనే వారికి ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన ఎదురవుతుంది. ఆ తర్వాత మను, బల్లి, బుగ్గు డంకీ మార్గంలో లండన్ వెళ్లేందుకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ నేపథ్యంలో హార్డీ తన ప్లాన్ ప్రకారం విజయం సాధించారా? హార్డీ ,స్నేహితులు వారి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మాత్రం పూర్తి సినిమాను చూడాల్సిందే.
ఎవరెలా చేశారు?
షారుఖ్ ఖాన్ బాగా యాక్ట్ చేసాడు. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా ఆ పాత్రలో అతనికి పెద్దగా స్కోప్ లేదు. తాప్సీ పన్ను డీసెంట్‌గా ఉంది. అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచెర్ పర్వాలేదు. విక్కీ కౌశల్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా వారు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ సిగ్నేచర్ స్టైల్‌తో, డుంకీ ఎమోషన్స్‌తో కూడిన రైడ్లు, హాస్యం వంటి అంశాలతో ఈ సినిమా ఫస్టాఫ్ మొదలవుతుంది. కానీ సెకండాఫ్‌లో స్టోరీ బ్యాలెన్స్ చేయడంలో విఫలమైనట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. మరోవైపు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
+మొదటి భాగము
+ప్రీ క్లైమాక్స్
+కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
-భావోద్వేగాలు లేకపోవడం
-సాధారణ ప్లాట్
-బోరింగ్ సెకండాఫ్