»Karnataka Bjp Mlas Son Who Was Caught Taking Prashanth Madal A Bribe Of 40 Lakhs
Bribe Case: 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే కుమారుడు
కర్ణాటకలో బీజేపీ(bjp) ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప(Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మాదల్(Prashanth Madal) రూ.40 లక్షల లంచం(bribe) తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లోకాయుక్త(lokayukta) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సాయత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతని కార్యాలయంలో దాదాపు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక(karnataka)లో ఈ ఏడాది అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న వేళ అధికార పార్టీ బీజేపీకి చేధు అనుభవం ఎదురైంది. బీజేపీ(BJP) ఎమ్మెల్యే(MLA)మాదాల్ విరూపాక్షప్ప(Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మాదల్(Prashanth Madal)రూ.40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ క్రమంలో లోకాయుక్త(lokayukta) అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. ఆ క్రమంలో అతని కార్యాలయంలో ఉన్న రూ.2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రశాంత్ బెంగళూరు(bangalore) నీటి సరఫరా, మురుగునీటి బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అతని తండ్రి ఎమ్మెల్యే విరూపాక్షప్ప(Virupakshappa) కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కంపెనీకి ఛైర్మన్ గా ఉన్నారు. ఈ సంస్థ మైసూర్ సాడల్ సబ్బుల(mysore sandal soap)ను తయారు చేస్తుంది. అయితే సబ్బు సహా ఇతర డిటర్జెంట్ల తయారీ కోసం ముడి పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టు(contract) ఇవ్వాలంటే 80 లక్షల రూపాయలు ఇవ్వాలని ఓ వ్యాపారిని ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఆ క్రమంలో బాధితులు లోకాయుక్తను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజులకు ముందు బాధితులు లోకాయుక్త(lokayukta)ను సంప్రదించగా..గురువారం సాయంత్రం ప్రశాంత్ ఆఫీసులో 40 లక్షలు తీసుకునే క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే తన తండ్రికి బదులు అతను డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అధికారులు చెబుతున్నారు.
మరోవైపు గతంలో కూడా కర్ణాటక(karnataka) బీజేపీ పార్టీ నేత, మంత్రి ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ కంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ క్రమంలో ఓ కంట్రాక్టర్(contractor) మరణించడంతో మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు ఈశ్వరప్పపై కేసు నమోదు కాగా..ఈశ్వరప్ప తన మంత్రి(minister) పదవికి రాజీనామా చేశారు.