»One Toilet For 700 People Saroornagar Junior College High Court Is Angry With The Telangana Government
TS High Court: 700 మందికి ఒకే మరుగుదొడ్డి..ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉండటంపై తెలంగాణ హైకోర్టు..రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసలు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాక సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు పంపించింది.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని(saroornagar) ప్రభుత్వ జూనియర్ కాలేజీ(government junior college)లో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి(toilet) ఉండటంపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈ కాలేజీతోపాటు తెలంగాణ(telangana)లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పనపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని(government) ఆదేశించింది. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాక సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు పంపించింది.
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థల్లో అమ్మాయిల(girls)కు తగిన వసతులు కల్పించాలని ఛీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్(ujjal bhuyan) పేర్కొన్నారు. సరైన వసతులు లేకుంటే ఆడపిల్లలకు రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులు(young woman) చదువుకోవడానికి ఉన్న అవకాశాలను వారికి దక్కకుండా చేయోద్దని సూచించారు.
సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీ(government junior college)లో అసలు కనీస వసతులు లేవని ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని చూసి ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్(manideep) పలుమార్లు అధికారుల(officers)కు లేఖలు రాశారు. అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు. మరుగుదొడ్ల(toilet)సౌకర్యం లేని కారణంగా అనేక మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రుతుస్రావం సమయంలో పలువురు అమ్మాయిలు అసలు కాలేజీకి కూడా రావడం లేదన్నారు. ఈ క్రమంలో దాదాపు 300 మంది విద్యార్థులు కాలేజీకి రావడం మానేశారని తెలిపారు. మరోవైపు అబ్బాయిలు టాయిలెట్ కోసం బయట ప్రాంతాలకు వెళుతున్నట్లు వెల్లడించారు.
గత మూడు నెలలుగా అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో మణిదీప్(manideep) మానవ హక్కుల కమిషన్(human rights commission) కు లేఖ రాశారు. అయినా కూడా అక్కడి ఛైర్మన్ సహా సభ్యులు కూడా లేకపోవడంతో హైకోర్టు(high court)కు లెటర్(letter) రాసినట్లు మణిదీప్ స్పష్టం చేశారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించి అధికారులకు నోటీసులు(notices) జారీ చేసింది.