»Indias Defeat In The Third Test By Australia Qualify For The Wtc Final Border Gavaskar Trophy
Border Gavaskar Trophy: మూడో టెస్టులో భారత్ ఓటమి..ఆస్ట్రేలియా WTC ఫైనల్‌కు క్వాలిఫై
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా ఇండోర్(indor)లో జరిగిన మూడో టెస్టు(third test match) మ్యాచులో ఆస్ట్రేలియా(Australia) భారత్(india)ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక భారత్ కూడా అర్హత సాధించాలంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా ఇండోర్(indor)లో జరిగిన మూడో టెస్టు(third test)లో టీమిండియా(team india) ఓటమి పాలైంది. మూడో రోజు నాటికి ఇండియా నిర్ధేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ జట్టు సునాయంగా ఛేదించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా(Australia) 9 వికెట్ల తేడాతో భారత్(india)ను ఓడించింది. ఈ క్రమంలో ట్రావిడ్ హెడ్ 49 రన్స్ చేయగా, లుబుషేన్ 28 పరుగులు చేశాడు. దీంతో ఒక్క వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 78 రన్స్ చేసింది. దీంతో నాలుగు టెస్ట్(fourth test match) మ్యాచుల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పటికే టీమిండియా(team india) రెండు టెస్టుల్లో విజయం సాధించింది.
గురువారం నాథన్ లియాన్ ఎనిమిది వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియాకు 76 పరుగుల లక్ష్యాన్ని 163 పరుగులకు ఆలౌట్ చేసింది. ఛెతేశ్వర్ పుజారా 59 పరుగులతో అత్యధిక స్కోరును సాధించాడు. లియోన్ 64 పరుగులకు 8 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. మరోవైపు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో లియాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక WTC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే చివరి టెస్టు మ్యాచ్ టీమిండియా(team india)కు కీలకం కానుంది. ఒకవేళ శ్రీలంక(srilanka) న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించినట్లయితే, భారత్ క్వాలిఫై కావాలంటే 4వ టెస్టులో విజయం సాధించాలి. న్యూజిలాండ్(new zealand)లో శ్రీలంక 2-0తో గెలవకపోతే, 4వ టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా భారత్ కు అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
ఇండోర్‌లో విజయంతో ఆస్ట్రేలియా జట్టు(Australia team) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(WTC final)లో తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు కూడా భారత్‌లో ఇది అరుదైన విజయమని చెప్పవచ్చు. తమ చివరి 17 ప్రయత్నాల్లో భారత్(india)లో ఇది కేవలం రెండో టెస్టు విక్టరీ మాత్రమే.