Ind Vs Aus జోరుగా నాలుగో టెస్ట్.. ప్రత్యేకార్షణగా ప్రధానులు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా రెండు టెస్టులు (Test Matches) గెలిచి జోరు మీదున్న భారత్ (India)ను మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చిత్తు చేసింది. దీంతో భారత్ ఇరకాటంలో పడింది. కచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్ట్ (Fourth Test Match) మ్యాచ్ అహ్మదాబాద్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. టెస్టు ప్రారంభానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని (Anthony Albanese), భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వీరిద్దరి సమక్షంలో నాలుగో టెస్టు మొదలవగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టింది.