IND Vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచిన టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా(Australia), భారత్(India) మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియానే వరించింది.

మొదటి మూడు టెస్టు(Test)లు కూడా మూడేసి రోజుల్లో ముగిశాయి. అయితే నాలుగో టెస్టు మాత్రం ఐదు రోజుల్లో ముగిసింది. నాలుగో టెస్టులో కేవలం 20 వికెట్లు మాత్రమే పడ్డాయి. నేడు ఆట ముగిసే సమయానికి లబుషేన్ 63, స్మిత్ 10 రన్స్ తేడాతో క్రీజ్ లో ఉన్నారు. అయితే ఇండియా(India), ఆస్ట్రేలియా(Australia) టీమ్ లు మళ్లీ జూన్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(Test Championship)లో పోటీ పడనున్నాయి.
శ్రీలంక(Sri Lanka)తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా(Australia) గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కి ఇండియా చేరింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్(India) అర్హత సాధించడం ఇది రెండోసారి కావడం విశేషం. WTC ఫైనల్ జూన్ 7న లండన్లోని ఓవల్ స్టేడియంలో జరగనున్నది.