వెస్టిండీస్‌పై చారిత్రాత్మక విజయం అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ‘గతంలో నాకు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కానీ, పదేళ్లుగా డగౌట్లో కూర్చొని కోహ్లీ, రోహిత్‌ల ఆట తీరును చూసి నేర్చుకున్నా. వారు నాకు సహాయం చేశారు. నా జీవితంలో గొప్ప రోజులలో ఇది ఒకటి’ అని శాంసన్ పేర్కొన్నాడు.