TG: SMలో వ్యూస్ కోసం కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని CP సజ్జనార్ మండిపడ్డారు. ‘మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.