బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో(Border Gavaskar Trophy) చివరి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (Australia) రెండో ఇన్నింగ్ ముడు పరుగులు చేసింది. అంతకు ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేజార్చుకున్నడు. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగాతో జరుగుతున్నఆసీస్ చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు ఆడి ఒక్క వికెట్ నష్టపోకుండా మూడు పరుగులు చేసింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో(Border Gavaskar Trophy) చివరి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (Australia) రెండో ఇన్నింగ్ ముడు పరుగులు చేసింది. అంతకు ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేజార్చుకున్నడు. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగాతో జరుగుతున్నఆసీస్ చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లు ఆడి ఒక్క వికెట్ నష్టపోకుండా మూడు పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, కున్మెన్ నిలిచారు. అంతకుమందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్.. ఆట ముగిసేసమయానికి 10 వికెట్లు కోల్పోయి 571 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో కోహ్లీ (186) డబుల్ సెంచరీ మిస్ (Double century miss)చేసుకున్నాడు. అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రీకర్ భరత్ (44), జడేజా (28) పరుగులు చేశారు. దీంతో 91 పరుగుల ఆధిక్యాన్ని భారత్ సంపాదించింది.
ఆసీస్ బౌలర్లలో నాథన్, మర్ఫీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, మాథ్యూ తలో వికెట్ తీశారు.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌటైంది. ఖవాజా (Khawaja) (180), గ్రీన్ (114) సెంచరీలు బాది అదరగొట్టారు. ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38), నాథన్ లైన్ (34), మర్ఫీ (41) పరుగులతో రాణించారు. భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.(Virat Kohli). ఈ టెస్ట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. దాదాపు 1200 రోజుల నుంచి మోస్తున్న బరువును దింపేసుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీ బాదాడు. విరాట్‌కిది 28వ టెస్టు శతకం కాగా.. అన్ని ఫార్మాట్లు కలిసి మొత్తంగా 75వ సెంచరీ. మ్యాచ్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన విరాట్ కోహ్లీ 241బంతుల్లో శతకం పూర్తి చేశాడు.