Rajinikanth: రాజకీయ సన్యాసంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం మామూలే. సినీ రంగంలోంచి రాజకీయం(Politics)లోకి వచ్చి సక్సెస్ సాధించిన వారు చాలా మంది ఉన్నారు. మంత్రి పదవులు చేపట్టి ప్రజా సేవ ఇప్పటికీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది పొలిటికల్ పరంగా సక్సెస్ సాధించారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తడంతో ఆ పనిని మానుకున్నారు.

చాలా రోజుల నుంచి రజనీ(Rajinikanth) పెట్టబోయే పార్టీపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. ఆయన సహ నటుడు అయిన మరో స్టార్ హీరో కమల్ హాసన్(Kamal hassan) పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే రజనీ(Rajinikanth) మాత్రం తన రాజకీయ ప్రవేశం గురించి ఎక్కడా స్పందించడం లేదు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. రజినీ(Rajinikanth) అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో తన రాజకీయ సన్యాసం చేపట్టే విషయం గురించి మాట్లాడారు.
తనకు కిడ్నీ సమస్య ఉందని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని రజనీకాంత్(Rajinikanth) వెల్లడించారు. బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనకూడదని తనను వైద్యులు హెచ్చరించారన్నారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కనీసం పది అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాలని తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సూచించాడని తెలిపారు. ఓసారి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అందరూ మాస్క్ తీయాలని కోరారని, అందుకే ఎక్కడా తన ఆరోగ్యం బయటపెట్టకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని రజనీ(Rajinikanth) తెలిపారు.