»Hero Daggubati Rana Who Apologized On Rana Naidu Series For Fans
Daggubati Rana: అభిమానులకు క్షమాపణ చెప్పిన రానా
రానా నాయుడు వెబ్ సిరీస్(rana naidu web series) ద్వేషించే అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు హీరో రానా(Daggubati Rana) ట్విట్టర్ వేదికగా మార్చి 12న పేర్కొన్నాడు. దీంతోపాటు ఈ సిరీస్ ను అభిమానించే వారికి సైతం ధన్యవాదాలు తెలిపాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్ నిండా బూతులు, అడల్ట్ కంటెంట్ ఉందని కామెంట్లు చేస్తున్నారు.
రానా నాయుడు(rana naidu) వెబ్ సిరీస్(web series) ద్వేషించే అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు హీరో రానా(Daggubati Rana) ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. మరోవైపు ఈ క్రైమ్, యాక్షన్ డ్రామా సిరీస్ నెట్ ప్లిక్స్ ట్రెండింగ్‌లో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సిరీస్ పట్ల ఆదరణ చూపిన అభిమానులకు సైతం ధన్యవాదాలు తెలిపారు. మార్చి 12న ఉదయం 10.49 నిమిషాలకు ఈ మేరకు ట్వీట్ చేస్తూ రానా ప్రకటించాడు. అంతేకాదు ఈ సిరీస్ ఫ్యామిలీతో కాకుండా ఒక్కరిగా ఉండి చూడాలని ఇంకోసారి పేర్కొన్నాడు.
Thank you for so much love ❤️❤️❤️ My sincere apologies to the ones who hate 🤗🤗 pic.twitter.com/dUx6MpK8uE
ఇప్పటి వరకు దగ్గుబాటి హీరోలు.. బాబయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా స్క్రీన్ పై అలా కనిపించి.. ఇలా వెళ్లిపోయారు. అందుకే పూర్తి స్థాయిలో కలిసి నటిస్తే చూడాలనేది దగ్గుబాటి ఫ్యాన్స్ కోరిక. ఎట్టకేలకు ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ సినిమాతో కాకుండా రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. అమెరికన్ డ్రామా సిరీస్ రే డొనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ రిలీజైంది.
ఈ సిరీస్ తండ్రీ కొడుకుల కథగా.. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కింది. దీంతో ఇప్పటి వరకు వెంకీ మామను ఇలాంటి క్యారెక్టర్లో చూడలేదని అంటున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓ వర్గానికి ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సిరీస్ కొన్ని చోట్ల బ్లూ ఫిల్మ్‌ను తలపించేలా ఉందంటున్నారు. అందుకే.. ఆ మాట ఒక్కటే తక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని డైలాగ్స్, సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవి చూసిన తర్వాత కొందరు వెంకటేష్ డై హార్డ్ ఫ్యాన్స్ కాస్త బాగానే హర్ట్ అయినట్టు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రానా నాయుడు, నాగనాయుడుగా వెంకటేష్, రానా పోటీ పడి మరీ నటించారు. కానీ వెంకీ కాస్త తనుకున్న ఫ్యామిలీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుంటే బాగుండేదని అంటున్నారు. అయితే వెంకీ మామ మాత్రం భిన్నంగా ట్రై చేశాడనే అంటున్నారు. ప్లేబాయ్ తరహా పాత్రలో.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరొట్టాడని అంటున్నారు. కంప్లీంట్‌గా ఈ సిరీస్ యూత్ టార్గెట్‌ను రూపొందించారని చెప్పొచ్చు.