Apologies MLA Rajaiah : సర్పంచి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే
స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే రాజయ్య సర్పంచి నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య దంపతులకు క్షమాపణలు తెలిపారు. ఈ సందర్బంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టి.రాజయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. రాజయ్య గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే రాజయ్య సర్పంచి నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య దంపతులకు క్షమాపణలు తెలిపారు. ఈ సందర్బంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టి.రాజయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. రాజయ్య గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. అనంతరం నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) మీడియా తో మాట్లడారు. సర్పంచ్ నవ్య (Sarpanch Navya) మాట్లాడుతూ, చెడును తాను ఖండిస్తాని ఆమె అన్నారు.
ఎవరికైన పార్టీలో విలువ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచిని కాగలిగానని అన్నారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండరాదని కోరుకుంటానని తెలిపారు. మహిళల (Women) పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని నవ్య వెల్లడించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని ఆమె చెప్పారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా సిద్ధమేనని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ, తెలిసీ తెలియక తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు (Apologies) చెబుతున్నానని అన్నారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశం, నవ్య భర్త ప్రవీణ్ (Praveen) ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తమకు పలు సూచనలు చేసిందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపిందని చెప్పారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని అన్నారు.తాను ఏ గ్రామం పట్ల వివక్ష ప్రదర్శించలేదని, జానకీపురం గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజయ్య హామీ ఇచ్చారు. జానకీపురం (Janakipuram) గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు.