KDP: ప్రొద్దుటూరు YVS బాలికల హైస్కూల్లో ఆదివారం జవహర్ బాల కేంద్రం విద్యార్థులకు టైక్వాండో బెల్ట్ గ్రేట్ పరీక్షలను నిర్వహించారు. కిక్కింగ్, పంచెస్, స్పారింగ్, కటాస్, బ్రేకింగ్, సెల్ఫ్ డిఫెన్స్, టెక్నిస్ విభాగాల్లో విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వ పరీక్షలు నిర్వహించినట్లు మాస్టర్ మునీశ్వర్ తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎల్లో బెల్ట్స్, ఎల్లో – 1 అందించారు.