TPT: గ్రామ దేవత గంగమ్మ తల్లికి ఆదివారం గ్రామస్తులు పొంగళ్ళు నిర్వహించారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరులో వెలసిన గంగమ్మ తల్లికి కొలుపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపద్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అలాగే ముగ్గు వేసి అమ్మవారి అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.