Lakshmi Parvathi : షాకింగ్ కామెంట్స్.. పవన్ పార్టీ పెట్టడానికి కారణం చంద్రబాబే..!
Lakshmi Parvathi : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని... ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని… ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు…. పవన్ ని కలిశారని.. ఆ తర్వాతే పవన్ ఈ జనసేన పార్టీని స్థాపించారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం స్టూడియోకు వెళ్లారని.. అవసరం ఉంటే బాబు ఏదైనా చేస్తారన్నారు. ఇప్పటికీ జనసేనాని పార్టీని బలోపేతం చేయడం లేదని.. ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారన్నారు. టీడీపీ, జనసేనల మధ్య ఒప్పందం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తీసుకొచ్చి పాదయాత్ర చేయాలని భావించారని.. ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పవన్… చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇక… ఇటీవల లోకేష్ తన పాదయాత్రలో… జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోఆహ్వానిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కూడా ఆమె స్పందించారు. లోకేష్ టీడీపీలోకి ఎన్టీఆర్‌ను పిలవడం చూస్తుంటే నక్క సింహాన్ని పిలిచినట్లు ఉందని సెటైర్లు పేల్చారు. లోకేష్ అనేవాడు అల్ప జంతువు.. ఏ క్వాలిటీ లేని వ్యక్తి అన్నారు. లోకేష్ పాదయాత్రకు జనాలు లేక కర్ణాటక, తమిళనాడు నుంచి తీసుకొచ్చారని.. ఈ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా లాభం లేదన్నారు లక్ష్మీపార్వతి. లోకేష్‌ను కాదని తారక్‌కు చంద్రబాబు పార్టీని ఇవ్వరని ఆమె అభిప్రాయపడ్డారు.